మేరా భారత్ మహాన్సుశీల రమేష్.M
మేరా భారత్ మహాన్సుశీల రమేష్.M
ఆనాడు కులమతాలకు అతీతంగా
ఎందరో మహానుభావులు ప్రాణాలు
సైతం లెక్క చేయకుండా చేయి చేయి
కలిపి పోరాడి సాధించిన స్వతంత్ర
భారతాన్ని, ఈనాడువిభజించు పాలించు
అనేసూత్రాన్ని పాటిస్తూ స్వార్థపూరితంగా
పాలించే పాలకుల చేతిలో పెట్టాము.
విష సంస్కృతికి బీజం వేస్తూ ,మన
ఆచార వ్యవహారాలను పక్కదారి
పట్టించారు. ఆడది అర్ధరాత్రి తిరిగిన
వేళ స్వాతంత్ర్యం వచ్చినట్టు అన్న
మహాత్ము ని మాటలకు తూట్లు పొడిచి
ఈనాడు పట్టపగలు కూడా పడతికి
రక్షణ లేకుండా చేస్తున్నారు.
దేశభక్తి అంటే జెండా వందనం రోజున
వాట్సాప్ స్టేటస్ లో విపరీతంగా
మెసేజ్ లు పంపడం కాదు, ఎక్కడున్నా
నేను భారతీయుడను అని ఎలుగెత్తి
సగర్వంగా చాటి చెప్పగలగాలి.