నా మనసు - సుశీల రమేష్ (కవిత)
నా మనసు - సుశీల రమేష్ (కవిత)
1 min
321
నీ చిరునవ్వు చూసిన
వెన్నెల అలుగుతుంది
ఆ నవ్వు నా నిదురను
దూరం చేస్తుంది.
నీ చూపులు చూసిన
చీకటి చెరుగుతుంది.
ఆ చూపు నా మనసుతో
ఆడుకుంటుంది.
నీవు ఎదురుగా లేకుంటే
నా మనసు చిన్నబోతుంది.
నీవు దగ్గరగా వస్తే నా
స్వరము మూగబోతుంది.
నీవు నా తోడుగా ఉంటే
సఖుడా సమయం తెలియదు.
జీవితాంతం నీ తోడుగా
ఉంటాననే నీ వాగ్దానం
నాకెంతో ఊరటనిస్తుంది.
ఈ జన్మకు నీ తోడు నే
కోరుతుంది నా మది
నీ తోడు నాకుండగా
ఈ లోకంలో ఇంకేమి
కోరుకోదు నా మనసు!
ధన్యవాదములు 🙏.
సుశీల రమేష్.
