STORYMIRROR

M " S R R" ✍️.

Inspirational

4  

M " S R R" ✍️.

Inspirational

హక్కుతిలకం- సుశీల రమేష్

హక్కుతిలకం- సుశీల రమేష్

1 min
161

ఆలోచన తో భారతీయులను తట్టిలేపి

తెల్లవారి గుండెల్లో కల్లోలం సృష్టించి

స్వాతంత్ర ఉద్యమాన్ని కొత్త పుంతలు 

తొక్కించి విప్లవాత్మకమైన భావాలతో

జాతీయోద్యమం ఉప్పెన లా మారేవరకు

నిరంతరం ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో

ఎనలేని కృషి చేశారు మన బాల గంగాధర తిలక్

కులమతాలకతీతంగా సామాన్యులను సైతం

ఉద్యమ బాట పట్టించారు.

జాతీయతను బలంగా నాటిన ఘనుడు.

స్వాతంత్రం జన్మహక్కు సాధించి తీరుతాం

అంటూ భరతమాత నుదుటిన

స్వరాజ్య హక్కు తిలకం దిద్దిన బుద్ధి జీవి.

మనం రోజూ వింటున్న ఆత్మ నిర్భర్

మేక్ ఇన్ ఇండియాను వందేళ్ల కిందటే

ఆకాంక్షించిన దార్శనికుడు తిలక్.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational