STORYMIRROR

M " S R R" ✍️.

Inspirational

4  

M " S R R" ✍️.

Inspirational

ప్రక్షాళన అవసరం-M.Susheela.

ప్రక్షాళన అవసరం-M.Susheela.

1 min
663


అక్షరాల వైపు పయనించు

విజ్ఞానం విజ్ఞత పెంచు

అంతేగాని,

చదివిందే చదివి బట్టి పట్టి

బుర్రలో ఊరబెట్టి ర్యాంకు కొట్టి

అందరి ముందు ఫోజు కొట్టకు

గానుగెద్దులా తయారవ్వకు

ఆసక్తిగా అక్షరాలను ఔపాసన

చేసుకుని సహజసిద్ధమైన

రీతిలో పయనించి చూడు

ప్రాపంచిక జ్ఞానం నీ సొంతం

అవుతుంది, చదువంటే

పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు

సహజ సిద్ధమైన విద్య వైపు

ప్రభుత్వం అడుగులు వేయడం

శ్రేయస్కరం, ఎందుకంటే బుర్రలో

ఇంగితం ఇంకిపోతే మాన్యులైనా

సామాన్యులైన ఒకటే, పాఠాలు

అర్థం కాక జవాబు చెప్పలేక

పీడకల మాదిరి పీడుస్తుంటే

ఇంటికి రా లేక బట్టీ చదువులకు

ఉద్యోగం రాక ప్రాణాలు 

విడుస్తున్న వారెందరో

భావితరాల భవితను కాపాడాలి

విద్యా వ్యవస్థకు ప్రక్షాళన అవసరం

ఆసక్తితో అక్షరాల వైపు

పయనించే లా ప్రోత్సహించాలి.


ధన్యవాదములు 🙏.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational