తననైజం
తననైజం
రోటిలొనలిగిన బాధేలేదు గోరింట ఎంతో శోభిస్తుంది
గాయమైందని ధ్యాసేలేదు మురళి రాగాలూ పలికిస్తుంది
బండరాతికీ హృదయంవుందీ ఉలితోమీటి చూడాలోయ్
దేహంచెక్కిన బాధేలేదు రాయందాలూ ఒలికిస్తుంది
సాధించాలను కోరికవుంటే గెలుపో ఓటమొ ముఖ్యంకాదు
ఒరిగానన్న కలతేలేదూ కెరటం మరింత పడిలేస్తుంది
విలువున్నా తన వునికేలేని పదార్ధముంటే లాభంలేదు
కాలానన్నా బాధేలేదూ స్వర్ణం మరింత మెరిపిస్తుంది
ఒకరిది త్యాగం ఒకరికి మోదం ఆత్మత్యాగమే తననైజం
అరిగానన్నా అలుపేలేదు చందనమెంతో తావిస్తుంది
