మామా!చందమామా!
మామా!చందమామా!
తేటగీతి /
మనకు దక్కినా డా చందమామ యిపుడు
మధురమైన క్షణంబులన్ మరువరాదు
సంబరంబులు జేయుచు సంతసముగ
పరవశించిరి గుమికూడి పౌరులెల్ల.//
తేటగీతి /
చలువ రాయుడు మమ్ముల స్వాగతించి
వెన్న బువ్వను తినిపించు ప్రీతితోడ
కథలు చెప్పుచు మా మామ కలలు తీర్చి
సిరికి తమ్ముడై యొడినిండ సిరులు నింపు.//