హనుమంతుడు
హనుమంతుడు
.కోరి జయించి రక్కసుల కూల్చె నశోకవనంబు హేలగన్
.నీరుటిపాప కీలలకు నిర్భయుడై చరియించి లంకనే
.ఘోరముగా కమల్చె తన గొప్పదనంబును చాటి చెప్పుచున్
.జారు యశంబునొంది భువి జాతను వీడ్కొని సంబరంబుతో
.వీరుడు రామ కార్యమును వేగమె సల్పెను బుద్ధిమంతుడై//