మగువా!
మగువా!
1 min
445
మగువా! ఓ మగువా!
అందాల కలువా!
తెగువా! నీ తెగువా!
వర్ణింప ఏమంత సులువా?
తల్లిగా నా
మొదటి గురువా!
ఏమిచ్చి తూచెద
నీ విలువా?
నీకై లిఖించ
నా కలము ఫలమా!
నీకై యోచించ
నా చదువు సఫలమా!
నీ నిమిత్తము
నా కవిత్వము!
ఏడు జన్మల
భాగ్యము!