మెట్టినిల్లు
మెట్టినిల్లు
కూతురి నుండి కోడలిగా ఉత్తీర్ణత
చేపట్టాలి సరికొత్త బాధ్యత
కావాలి అత్యంత జాగురత
మన ఇల్లు మనవాళ్లు
అని ఉండాలి ఆసక్తిత
దరిచేరనీయకూడదు నిరాశక్తత
ఇంటిని చక్కదిద్దుకోవడానికి
ఉండాలి ఉత్సుకత
కొత్త బంధాల నడుమ
పొందాలి ఆత్మీయత
ప్రేమని పంచిపెట్టి
పొందాలి ఆప్యాయత
మెట్టినిల్లు మన జీవితకాల
అందమైన పొదరిల్లు
