STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మదనిక

మదనిక

1 min
5



ఒకకొమ్మ పట్టుకుని..వేచె'నా మదనిక..! 
సాలభంజిక రూప..నవ్వె'నా మదనిక..! 

మది దోచుకొనిపోయి..మాయేల చేసెనొ.. 
మైమరపు సీమలో..నిలిపెనా మదనిక..! 

మౌనమే తన భాష..ప్రతిమొగ్గ సాక్షిగ.. 
తనసిగ్గు తేనియల్..ఒలికె'నా మదనిక..! 

నా నిదుర కాజేసె..ఏనాడొ తెలియదు..
తనకురుల గాలినే..పంపె'నా మదనిక..! 

విరహంపు పరవశం..తనసొంతమేమో.. 
సరిహద్దు రేఖలను..గీసె'నా మదనిక..! 

మధుమాస సౌందర్య..లోకమే తానే.. 
వాసంత సౌరభం..చిందె'నా మదనిక..!


Rate this content
Log in

Similar telugu poem from Classics