మధురం...
మధురం...
మాటరాని మౌనం
మనసుకు తెలియని వైనం
మదిని మీటిన గానం
మౌనం పెదవి దాటితే
నా మనసు భాషకు అందని
మధుర భావాలెన్నో....
ఆ మౌనం ....మదిని దాటితే
మరపురాని .... మధుర జ్ఞాపకాలెన్నో
ఆ జ్ఞాపకాలు తెరచి చూస్తే
సుమరాగాల విరివనాల పరిమళాలెన్నో
కలువ కనులలో దాగిన చిలిపి కలలెన్నో
పెదవి గడపదాటని అందమైన కావ్యాలెన్నో
ఎదురు చూపెంత మధురమో కదా
ఆ క్షణమో మరుక్షణమో నువ్వొస్తావని..
ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నా
ఈ ఎదురుచూపుల ఉరవడితో..
బరువెక్కిన
కనురెప్పలమాటున నువ్వు కదలాడుతుంటే..
కనులు మూసి నిన్ను చూడాలో కనులు తెరిచి
ఎదురుచూడాలో తెలియక సతమతమవుతున్నానే..
.... సిరి ✍️

