మధురమే
మధురమే
ప్రతి కణము మాట్లాడు..మౌనమే మధురమే..!
చెలిచూపు రాగాల..సంద్రమే మధురమే..!
భాషలకు అందనిది..మనసుపడు వేదనే..
కనలేని దృశ్యాల..కావ్యమే మధురమే..!
ఏ మెఱుపు తీగతో..బంధమో ఊహలో..
మేఘాల తేఱులో..పయనమే మధురమే..!
జీవితం గాలిలో..అద్దాల మేడలో..
ప్రేమతో ప్రేమలో..యుద్ధమే మధురమే..!
ఊరించు అందాల..నగరియే నా సఖియ..
గజలైన సెలయేటి..తీర్థమే మధురమే..!
ఉన్నదే లేనిదై..లేనిదే ఉన్నదోయ్..
భ్రమలన్ని తొలగించు..గగనమే మధురమే..!

