STORYMIRROR

Kadambari Srinivasarao

Abstract

4  

Kadambari Srinivasarao

Abstract

మధుర జ్ఞాపకం

మధుర జ్ఞాపకం

1 min
344


గడిచిన కాలం రేపిన గాయాలను

తలుచుకుంటూ కూర్చుంటే

రాబోయే రోజులు సుఖవంతమౌతాయా!

కంటికి కనిపించని సూక్ష్మ క్రిమి

చేసిన వినాశానికి 

నవ వత్సరం ధీటైన జవాబు కావాలి

మానవ జాతి మనుగడకే

ముప్పు కల్పించిన 

కరోనా మహమ్మారిని

తరిమికొట్టే శాస్త్ర విజ్ఞానపు మొగ్గ

పుష్పించి వికసించాలి

కడుపు నింపే రైతన్న

కడగండ్లు ముప్పేటలా

తొలగి నవకాంతుల

హాలికుడు దర్శనమీయాలి

ఇడుముల ఇరవై

ఒక పీడ కలగా ఇబ్బంది పెడితే

చిగురించిన కొత్త ఆశలకు

మధుర జ్ఞాపకంగా ఇరవైఒకటి

మచ్చ లేని మహారాజుగా నిలవాలి



Rate this content
Log in

Similar telugu poem from Abstract