మౌనయోగమె
మౌనయోగమె
పూలతేనెలు గ్రోలుమచ్చట..రాలనీవే చక్కగా..!
మనసుగొడవే ఇగిరిపోగా..మరగనీవే చక్కగా..!
ఎన్ని లెక్కలు ఏమి చింతలు..జన్మచిక్కే వీడవా..
సరళపరుషము లేవిగానీ..ఆగనీవే చక్కగా..!
అందమేదో గంధమేదో..పరిమళించే దారులా..
చింతనిప్పుల చూపులేవో..మరలనీవే చక్కగా..!
మంత్రవాణీ మోహసుధలో..మునకలేనా ఎంతకీ..
తాంత్రికతకే మూలమేదో..తెలియనీవే చక్కగా..!
మాటలేల వేయివిధముల..మరణయాతన చూడవా..
పట్టువీడని మౌనయోగమె..పట్టనీవే చక్కగా..!

