మౌనపు కోవెల
మౌనపు కోవెల
పాటల వెన్నెల..వానగ తానే..!
బ్రతుకును దిద్దే..చెలియగ తానే..!
ఊహకు అందని..నాటకమే ఇది..
ఎఱుకన నిలిపే..జ్వాలగ తానే..!
కన్నులు మూయక..లేదే సౌఖ్యం..
కలలను చక్కగ..కాల్చగ తానే..!
పరవశ మన్నది..మనస్సు ముసుగే..
యదార్థం మేదో..లీలగ తానే..!
నిలకడ నిలిపే..మంత్రం లేదోయ్..
మౌనపు కోవెల..చేర్చగ తానే..!

