మౌనం తో
మౌనం తో
మౌనంగా నిష్క్రమిస్తునవా?
మౌనం అంటే నిశ్శబ్ద అగాధం!
మౌనం అంటే అనంతమైన ఆకాశం!
మౌనం అంటే ఒక ఓదార్పు!
మౌనం అంటే ఒక నిట్టూర్పు!
మౌనం అంటే కొత్త ఆలోచనల జన్మస్థానం!
మౌనం లో ఉప్పెనలు దాగి ఉంటాయి!
మౌనం లో ఉల్కాపాతలు జరుగుతుంటాయి!
మౌనం గడ్డకట్టిన కన్నీటి సముద్రం!
క్రూరమైన ప్రపంచానికి మౌనం ఒక ధిక్కారం!
ఎన్నో ప్రశ్నలకు సమాధానం మౌనం!
సమాధానం లేని ప్రశ్నలకు సమాధానమే మౌనం!
... సిరి ✍️❤️

