STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Classics

4  

Dinakar Reddy

Abstract Drama Classics

మాయా ప్రవరుడు

మాయా ప్రవరుడు

1 min
334

నే నమ్మాను

చాలా నమ్మాను

మళ్లీ రేపు సూర్యుడు తప్పక వస్తాడని 

తామర పూవు నమ్మినట్టు

ఈ చంద్ర కిరణాలు వీడిపోవని

కలువ పూవు నమ్మినట్టు


ఎంత కష్టమొచ్చినా

ఏం ముంచుకొచ్చినా

వానలొచ్చి పంటలు పండి

కష్టాలు గట్టెక్కుతాయని

రైతు నమ్మినట్టు


ఆరుద్ర పురుగులు చూసి

వర్షాలు బాగా పడతాయని నమ్మినట్టు


నే నమ్మాను

చాలా నమ్మాను

నిన్ను చాలా నమ్మాను

వెళ్ళిపోతాను అని తిరిగి వచ్చినది

ప్రవరుడే అని వరూధిని నమ్మినట్టు

నే నిన్ను నమ్మాను


మాయా ప్రవరుడు మాయ చేశాడు అని

ఆనాడు వరూధినికి తెలియదు

ఈనాడు ఈ వరూధినికి తెలిసినా ఏం చేయగలదు

అని ఆమె వ్రాసుకొంది తన మనస్సులోని వేదనను 

ఎవరికీ చెప్పలేని బాధను



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract