మాయ పొరలు తొలగించు చూడ అంతా ఒకటే !!
మాయ పొరలు తొలగించు చూడ అంతా ఒకటే !!


మాయ లోకము అంటూ కాదిది, బ్రహ్మమయం లో ఒకటి కాక
ఇహము,పరము అను భేదము లేదు కమ్ముకున్న చీకటి పొరలు కాక
కమ్ముకున్న చీకటి పొరలు తొలుగున ,ఆత్మ జ్ఞానము పొందక
ఆత్మ జ్ఞానము పొందగలుగు నా,సద్గురువు తోడు నీతో ఉండక.
అట్టి సద్గురువు కొరకు జన్మంతా వెతికిన నష్టము లేదు లాభమే కాక
అటుపై సద్గురువు తోడ ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం గా
బ్రహ్మమయం లో ఒకటే పో గాక.
_____________________________
అర్థము:
మాయాలోకం అని సపరేట్గా లేదు ఈ లోకము
బ్రహ్మమయం లోనే ఇది ఒకటి
అజ్ఞానం చేత చీకటి పొరలు కమ్ముకున్నాయి అది ఏ మాయ అని పిలువబడుతున్నాము.
మాయా ఎక్కువ ,తక్కువ అని విభజించి లోకము గా పిలవబడుతున్నారు.
ఆత్మజ్ఞానంతో ఈ మాయ పొరలను చేదిస్తాది.
మాయా పొరలు లేనిచోట అంతా ఒకటే అవును ఆత్మజ్ఞానం కాస్త బ్రహ్మజ్ఞానము గా మారి.
దీనికంతటికీ సద్గురువు బోధనలు మరియు సహాయము చాలా అవసరము.
అట్టి సద్గురు కొరకు జీవితాంతం వెతికినా లాభమే కలుగును.
-మీ ప్రేమ కిషోర్