నీ మనసు స్థితిగతులను నీవు ఎర్రగా ఓయ్!!
నీ మనసు స్థితిగతులను నీవు ఎర్రగా ఓయ్!!
వినఓ మనిషి ఇది విన ఓయి!!
నీ మనసు స్థితిగతులను నీవు ఎరగవోయ్
కనురెప్పలు తెరవటం లో మొదలైన దోయి
మరలా కనురెప్పలు మూసే వరకు ఈ కోరికల యుద్ధము ఆగదోయి !! విన వో మనిషి!!
నాది అన్నది ఏది అయినా కొద్ది కాలం వరకు మాత్రమే నీతో ఉండు నోయి!
ఎంత ఇష్టమైనది అయినా నీ దగ్గరే ఉంటే అఇష్టం అవుతుందని గ్రహించ ఓయ్ !!వినఓ మనిషి!!
చెడు ఆకర్షించి మంచిని దూరం చేయడం నీ మనసు లక్షణమోయి!
నీ ఆలోచనలను బట్టి నీ వ్యక్తిత్వము నిర్మితంమవుతోందోయి!!వినఓ మనిషి!!
జీవితంలో సుఖం కంటే ..కష్టమే నీ చెంత ఉండు నోయి..
ప్రతి కష్టము.... ఒక పాఠం అనుకొని పోరాడ ఓయ్.... !!వినఓ మనిషి!!
ఆత్మశుద్ధి కొరకే ఈ లోకమునకు వచ్చావని మరువకోయి...!
ఆ భగవంతుడు చెప్పిన మార్గాన్ని ఎంచుకుని ఆత్మజ్ఞానాన్ని పొంద ఓయి..!!
అటుపై నీ మనసు ఆటలు సాగవోయి..నీ గమ్యాన్ని నీవు చేరుకొనేదవోయి ..!
ఇదే నోయి ఇంతే నోయి అన్నింటికీ కారణం నీ మనస్సే నోయి....!! ఇదే నోయి ఇంతే నోయి!!