STORYMIRROR

Kadambari Srinivasarao

Abstract

4  

Kadambari Srinivasarao

Abstract

మాతృదేవోభవ

మాతృదేవోభవ

1 min
350

నవమాస యజ్ఞంలో నానా కష్టాలు పడ్డావు

పేగు పంచి పోషణ కావించావు

నాకు ఊపిరి పంచిన దైవం నీవు

బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేసి

భాగ్యశాలిని చేసిన ఆది దేవతవి

అక్షరాలు నేర్పిన ఆదిగురువు నీవు

నాణ్యమైన నడతను ప్రసాదించావు

కమ్మనైన పిలుపుకు రూపం నీవు

ఆప్యాయత,అనురాగాల 

కలబోతకు ప్రతిరూపానివి

ఆత్మీయత, మమకారాల కోవెల నీవు

నా సుఖాలకై వెతలెన్నో అనుభవించావు

ఇవ్వడమేకానీ ఏదీ ఆశించని త్యాగశీలి నీవు

నా భవితకు పూలబాట వేశావు

నా ఉనికికి ఆధారం నీవు

నీ గుండె గదిలో నాకు

పదిలమైన స్థానమిచ్చావు

మనసు తెలిసి అన్నీ సమకూర్చి

కోరిన వరాలనెల్ల తీర్చే కల్పవల్లివైనావు

నా కీర్తికి చిరునామా నీవు

నా అభివృద్ధికి అగ్రపధమై నిలిచావు

ఏమివ్వగ నీ రుణం తీరు

నీకు అమ్మనైన గాని తెలియలేను



Rate this content
Log in

Similar telugu poem from Abstract