Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kadambari Srinivasarao

Abstract

4.5  

Kadambari Srinivasarao

Abstract

మాతృ హృదయం

మాతృ హృదయం

1 min
422


గర్భ క్షేత్రంలో ప్రేమానురాగాల బీజం ప్రవేశించి

అపురూప రూపంతో విత్తు 

పసి మొక్కగా ప్రాణం పోసుకుని

ప్రపంచానికి పరిచయం కాబోతున్న వేళ

పేగు పంచి ఊపిరిపోస్తూ

కన్న కలలు నిజం అయ్యే వేళ

ఆ హృదయం పరవళ్లు తొక్కే గంగమ్మ


అనురాగ అమృతాన్ని మూటకట్టి

కళ్ళలో ఒత్తులు వేసుకుని

తన ఆకలినిసైతం ఆదమరిచి 

కన్న పేగుకు పంచిపెట్టే 

ఆ త్యాగ శీల హృదయం అన్నపూర్ణ


బిడ్డ కాలిలో గుచ్చుకున్న ముళ్లు

తన గుండెల్లో దిగిన కత్తిలా తల్లడిల్లి

రెప్పలు దాటే దుఃఖపు చెలమలు

ఆ చెమ్మగిల్లిన హృదయం ఆనవాళ్లు


సంతు కళ్ళలో సంతోష కాంతులకోసం

ఘనమయ్యే వరకూ చమురుపంచే

వెలుగు దివ్వె తానై

ఆ పరితపించే హృదయం నిత్య తపస్విని



Rate this content
Log in

Similar telugu poem from Abstract