మార్గ దర్శి
మార్గ దర్శి
'ఓన' మాలను నేర్పించి యొజ్జ మనల
దీర్చి దిద్దును జగతిలో
దెఱువు జూప
గురువు మహిమను పొగడంగ తరమ!మనకు
వారి పదములు మ్రొక్కరె! భక్తితోడ.
చిలిపి యల్లరి జేసినా జేరదీసి
చదువు సంధ్యలు నేర్పును సముచితముగ
ప్రతిఫలంబును కోరని వరదుడతడు
గురుని ఋణమును తీర్చుట యరుదు భువిని.
శాస్త్ర విద్యలు బోధించి శ్రద్ధతోడ
తప్పులన్నియు సరిదిద్ది సతత మతడు
జ్ఞాన మార్గము చూపించు ఛాత్రులకును
పరమ పురుషుడు గురువును వదల వలదు.
శ్రేయ మొసగునా గురునకు సేవ జేసి
లాభ మొంది తరించిరి రాజ తతియు
వేల్పులుగ జనించినవారు విద్య నేర్వ
గురువు పదములు పట్టిరి కరము మోడ్చి.
తల్లి తండ్రియు గురువని తలచ వలయు
గురువు నేర్పిన విద్యను మరువ వలదు
ధర్మ పథమును బట్టి సత్కర్మ చేసి
నిలువ వలయును సతతము నిష్ఠతోడ.
ఇహము పరము జూప ధరలో
నీశ్వరుండు
గురుని రూపము దాల్చెను కూర్మి తోడ
భక్తి శ్రద్ధల కొల్చిన భవిత మిగులు
విజయ మెప్పుడు వెన్నంటి వెనుక నడచు.
-----------------------
