మాపై ఎందుకింత వివక్ష
మాపై ఎందుకింత వివక్ష
మా మాట పట్టదు
మేమంటే గిట్టదు
మాకు ఏమిటీ పరీక్ష
మాపై ఎందుకింత వివక్ష
తల్లిదండ్రులకు తలవంపులే
కానీ ఏం చేయమంటారు
మాలో వచ్చిన మార్పును
ఓదార్చే పెద్దమనసు
ఎవరికుంది ఇక్కడ?
పగలంతా పరేశాన్ చేస్తామని
అనుకుంటే పొరపాటే!
రాత్రంతా పగటి కోసం
పడిగాపులు కాయటం పరిపాటే!!
అవమానమే తప్ప
రాజపూజ్యం లేని జాతకాలు మావి
గేలి చేసే వారిని
వేలెత్తి చూపలేని జీవితాలు ఇవి
మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వని
మామూలు గాళ్ళ చేతిలో ఆటబొమ్మలం
మనసుకు కనీస మర్యాద చాలనుకునే
మూడో రకపు మనుషులం!
రచన : వెంకు సనాతని
