STORYMIRROR

# Suryakiran #

Abstract

4  

# Suryakiran #

Abstract

లవ్లీ ఏజంల్ !

లవ్లీ ఏజంల్ !

1 min
405

దేవకన్య భూలోకవాసుల ఊహాసుందరి .

ఆదర్శభావాలను తలపించే మనోహర దృశ్యమంజరి .


తెల్లని దుస్తుల్లో కదులుతూ కనిపించే అవివాహిత .

చల్లని చూపులతో చిరునవ్వులు చిందించే వనిత .


తన జీవితంలో పురుషుడు కోరుకునే ప్రియమణి .

స్త్రీలకు ఆత్మీయ నేస్తమనిపించే ఒక రమణి .


బాలికలను అబ్బురపరచే దివ్యమైన రూపం .

తమకోసం తాము కలలు గనే మంగళ స్వరూపం .

ఆధ్యాత్మికతను గొలిపే బృందావన గోపిక .

కన్నయ్య ప్రేమకు అంకితమయ్యే రసరమ్య దీపిక .


ఇంటి సభ్యులను అలరించేలా ఆమె మాటల ముత్యాలు .

చిత్రాల్లో అందాన్ని సంతరించుకునే కుడ్యాలు .


అలా అలంకరించుకుంటే చూపరులకు హాస్యవల్లరి .

అనుకరిస్తే అంతులేనంత వినోదాన్ని పంచే అల్లరి .


ఆడపిల్లలందరూ దేవకన్యల్లా కనిపిస్తే ఎంతో ఆనందం .

నందనవనం కావాలని కోరుకుందాం మన ప్రపంచం .

*** # *** # ***



Rate this content
Log in

Similar telugu poem from Abstract