Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Thriller

4.5  

Eevani Ravisankara Sarma

Thriller

లతలా కనిపిస్తావే ! ❤️

లతలా కనిపిస్తావే ! ❤️

1 min
374



పగలంతా చుట్టూ లతలా కనిపిస్తావే ,

రేయంతా అల్లరే నా గుండెలో చేసేస్తావే !

నిను మరచినా ఊహలా కనిపిస్తావే ,

కనులలో కమ్మని కథలా దాగుంటావే !


ఎప్పుడే ... మనమెప్పుడే ... ఒకటయ్యేది ?

నాలో నువ్వయ్యేది ? నీలో నేనయ్యేది ?

చెప్పవే ... చెప్పవే ... ఈరోజే తొలిసారి ,

ప్రతినిమిషం మళ్ళీమళ్ళీ తుళ్ళేలా ఓ కావేరీ ,

ప్రేమసుధనే ఒలికించే వయ్యారీ !

నా మనసునే తియ్యగా లాగేసే మయూరీ ..!


సరిహద్దులు ఇరువురిని ఆపేస్తాయా ,

ఇరుగుపొరుగైనా , ఇష్టాలు వేరని

మనలో ప్రేమను కనికరమే లేకుండా చెరిపేస్తాయా ?


అడ్డు తొలగేదాకే అందరు ఎవరికివారు .

కళ్ళు విప్పామా అయిపోతాం ఒకరికి ఒకరు .

ఒక్కటే ... మనమంతా ఒక్కటే ... ,

మనుషులంతా మమతలతో పుట్టినవారే అంటే ,

ఏకతాటిపై ఉండిపోదా ప్రపంచమంతా వింటే !


రారమ్మని కబురిమ్మని నా మాట ,

నడిచేద్దాం నేటినుంచే మనమిద్దరం ఒక బాట !

----------------------------



Rate this content
Log in

Similar telugu poem from Thriller