లోకం తీరు
లోకం తీరు


హితము చెప్పగజూస్తే
ముర్కుడు అంటూ ముందుకు జరిగే
పాడు లోకం....
ముచ్చటగా ముత్యమంత చేదు చెప్పిన
చెక్కర అంటూ పోగుడు పాడు లోకం
కరుకు మాటలలో హితం కానరాదు
తేనెలూరు మాటలలో విషం తెలియని
వెర్రి జనాలు .....
పై పై కరుకుదనం కళ్ళకు కనిపిస్తుంది కానీ
మనసులోని కాల కూట విషం కనిపించదు....
మధుర మాటలకు బోల్తా పడకు.....
మనషుల వ్యక్తిత్వం చూసి నడువు.....