STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

లలితా దేవీ వైభవం

లలితా దేవీ వైభవం

1 min
348

లోకములకు ఆధారము లలిత

కాపాడునది నీవే హేరంబుని మాత

కష్టములను తీర్చు దివ్య వనిత

మము కావవమ్మా శ్రీ చక్ర పూజితా


సర్వ దేవతల శక్తివి నీవే

శక్తి స్వరూపముగా ఇలలో వెలిగేది నీవే

కరుణించే మహాలక్ష్మివి నీవే

జ్ఞానమొసగే సరస్వతివి నీవే

లక్ష్మీ సరస్వతులు సేవించు శ్రీ రాజ రాజేశ్వరీ దేవివి నీవే


అమావాస్య నాడు చంద్రుని చూపిన అభిరామీ

మోహము అజ్ఞానములో మునిగిన భక్తుని కావవేమి

భక్తుల కష్టం తీర్చగ ఇంత జాగేమి


దేవీ లలితా పరాభట్టారికా

నీ పూజలు చేసి నిను భజియించి

సదా నీ పాదముల యందు చిత్తము నిలుపు వరమీయవమ్మా దుర్గమ్మా

సదా శివకుటుంబినీ మము కావవమ్మా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract