కవలలు..
కవలలు..
వలవల ఏడ్చినా
వల వేసినట్టు మాటలు చెప్పినా
ముద్దులు మూట కట్టినా
ఆ అన్నదమ్ములు ఒక్కటే
ఒకరి పెన్సిల్ పోతే
మరొకరు జామెట్రీ బాక్స్ పోగొడతారు
ఒకరు టీవీ ఆన్ చేస్తే
ఇంకొకరు చూడ్డానికి రెడీ అవుతారు
ఒకరు క్రికెట్ ఆడుతుంటే
మరొకరు బాల్ పక్కింట్లో పడకుండా
జాగ్రత్త పడుతుంటారు
ఒకరు గెడ్డం పెంచితే
మరొకరు సపోర్టు చేస్తారు
ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్తారు
స్నేహితుల కబుర్లలో కష్టాలు చూస్తారు
ఈర్ష్య కలిగించేంత అన్యోన్యంగా ఉంటూ
అదేం గొప్ప విషయం కాదన్నట్లు
ఆశ్చర్యపరుస్తూ ఉంటారు
గొడవకు వెళ్లరు
సమాధానం పనులతో చెబుతారు
ఒకటేగా కనిపించని కవలలు
ఒకే మాటతో
మనసులోని భారాన్ని తగ్గిస్తారు
