STORYMIRROR

jayanth kaweeshwar

Classics

5.0  

jayanth kaweeshwar

Classics

కవితా పూరణం

కవితా పూరణం

1 min
297



దత్త పాదం : " మంచి వారల కెంచి చూడగా మంచి రోజులు రావులే "


పూరణం : 

ఇంచుక స్వీయ కర్మలందుపరులకు సహాయమందించు సుజనులే 

సంచిత  పాప కర్మల నాచరించు కుజనులు చె డుత్రోవలోని వారలే 

పంచిన దుష్కర్మలను అనుభవించె డు సుజనుల జీవితపథమ్ముల 

నుంచి పయనించే మంచి వారలకెంచి చూడగా మంచిరోజులు రావులే  || 


ప్రతిపదార్థము: 

 1. ఇంచుక = కొంచెమైనా 

 2. స్వీయ కర్మలందు = స్వంత పనులందు 

 3. పరులకు = ఇతరులకు 

 4. సహాయము = ఉపకారము 

 5. అందించు = చేయు 

 6. సుజనులే = మంచివారే 

 7. సంచిత = సంప్రాప్తించిన దుష్కర్మలను 

 8. ఆచరించు = చేసి ఇబ్బంది పెట్టేవారు 

 9. కుజనులు = దురాత్ములు / దుర్మార్గులే 

10. చేదు త్రోవలో ని = చెడు మార్గములో పయనించు 

11. వారలే = వారే 

12. పంచిన కుకర్ములు = వారి ద్వారా

ఆచరింపజేసిన చెడు పనులను 

13. అనుభవించెడు = ప్రత్యక్షంగా / పరోక్షంగా చేయించ బడినవారు 

14. సుజనుల = సజ్జనుల / మంచివారల 

15. జీవితపథమ్ము ల = జీవిత మార్గముల నుంచి 

16. పయనించే = ప్రయాణం సాగించే 

17. మంచి వారలకు = సుజనులకు 

18. ఎంచి చూడగా = వెతికి చూడగా / చూసినా కూడా 

19. మంచి రోజులు = శుభ దినాలు / మేలు కలుగు రోజులు 

20. రావులే = రాజాలవులే/ కనిపించవులే .


భావం : 


కొంచెమైనా తమంతట తాము స్వతాహా స్వంతపనులతో ఇతరులకు సహాయము చేయు మంచివారే సంప్రాప్తింపబడిన దుష్కర్మల ను ఆచరించే కుజనులను చేసి ఇబ్బంది పెట్టే దుర్మార్గులు/ దురాత్ములే వారిద్వారా ప్రేరేపించాపబడిన చెడు పనులను ప్రత్యక్షంగా / పరోక్షంగా అనుభవించిన మంచి మనుషుల జీవిత మార్గముల నుంచి ప్రయాణం సాగించే సుజనులకు వెతికి చూసినా కూడా శుభ దినాలు / మేలు కలుగు రోజులు రాజాలవులే/ కనిపించవులే . అని భావం 


                            


Rate this content
Log in