కవితా పూరణం
కవితా పూరణం


కవితా పూరణం : 4.2.2020
దత్త పాదం " అన్నను పెండ్లియాడెను మహా మహిమాత్ములు మెచ్చగా భువిన్ "
పూరణం :
కన్నకూతురు,ఆకాశరాజసుత,చెలులతో వాహ్యాళినందు పద్మావతి
కన్న నతిసమీప పూదోటన్ అరుదెంచిన శ్రీనివాసునితా వలచెనట
విన్న వివాహ సంధి కార్యములన్ పరికించి తా ప రిణయ మాడెద
అన్నను పెండ్లియాడెను మహా మహితాత్ములు మెచ్చగా భువిన్ ||
ప్రతి పదార్థము :
1. కన్న కూతురు = స్వంత కూతురు
2. ఆకాశరాజ సుత = ఆకాశ రాజు పుత్రిక
3. చెలులతో = తన చెలికత్తెలతో
4. వాహ్యాళి నందు = విహార యాత్రలో
5. పద్మావతి = పద్మావతి దేవి
6. కన్న - గాంచిన (చూసిన)
7.అతి సమీపాన = చాలా దగ్గరగా
8. పూదోటన్ = ఉపవనంలో (పూల తోటలో )
9.అరుదెంచిన = వచ్చిన (వేంచేసి యున్న )
10. శ్రీనివాసుని = వేంకటేశ్వర స్వామిని
11. తా = తాను
12. వలచెనట = ప్రేమించెనట(వలచివచ్చిన యువతి )
13. విన్న = విన్నటువంటి
14. వివాహ సంధి = వివాహ రాయబారములు, పెళ్లి కార్యములు
15. పరికించి = గమనించి (చూసి )
16. తా = తానూ ( పద్మావతి దేవి )
17. పరిణయమాడెదనని = పెళ్లిచేసుకుంటానని
18. అన్నను = అని (చెప్పి )
19. పెండ్లి యాడెను = వివాహము చేసుకొనెను
20. మహా = గొప్ప
21. మహిమాత్ములు = మహిమ గల ఆత్మ గలవారు (శివుడు, బ్రహ్మ, నారద మొదలైన వారు )
22.భువిన్ = భువిలో ( ఇలలో )
23. మెచ్చగా = మెచ్చుకొనగా ,అభినందించగా
భావం : కన్న కూతురైనటువంటి ఆకాశరాజపుత్రిక , తన చెలులతో వాహ్యాళి లో
పద్మావతి దేవి చూసినట్టి (కని ) / గాంచినట్టి, అతి సమీపములో పూదోట యందు వచ్చినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామిని ,తానూ ( పద్మావతి దేవి) వలచెనట (ప్రేమించెనట ) . విన్నట్టి ఏమివిన్నట్టి అంటే వివాహ రాయబారాములు, సంధి కార్యముల సంగతి , గమనించి/ ఆలోకించి తా ను ( దేవి) పెళ్లిచేసుకుంటానని
అన్నను (అన్నప్పటికీ ) చెప్పినప్పటికీ పెండ్లియాడెను .ఎలాగంటే గొప్ప మహిమ గల ఆత్మగలవారు అంటే ( ఇతర దేవతలు అంటే బ్రహ్మ, శివుడు, నారదుడు మొదలైన వారు). మెచ్చుకొనగా/ అభినందించగా . - ఇలలో పద్మావతి దేవి - శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పరిణయము చాలా ఘనంగా జరిగెనని భావము. .