STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Inspirational

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Inspirational

కవిని నేనే...

కవిని నేనే...

1 min
321


కవిని నేనే...

నా కవితా శిల్పాన్ని నేనే...

నన్ను నేనే ప్రేమిస్తూ..

నన్ను నేనే ద్వేషిస్తూ..

నాతో నేనే యుద్ధం చేస్తూ.

నాలో నేనే ఓదార్పు పొందుతూ..

నా భావాలను రాసుకునే..

కవిని నేను...

కొందరు భావ కవిని అంటారు నన్ను,

అవును మనసులోని భావాలను తప్ప

బాధను చెప్పలేని నేను భావ కవిని..

కొందరు స్త్రీ వాద కవిని అంటారు,

అవును స్త్రీ కి స్వేచ్ఛ, స్వాతంత్య్రం

కావాలని కోరుకునే స్త్రీ వాద కవిని నేను.

కొందరు విప్లవ కవిని అంటారు,

అవును కలం తో తప్ప

గళంతో పోరాడలేని

విప్లవ కవిని నేను....

కవిని నేనే ...

నా కవితా శిల్పాన్ని నేనే.. !

శ్రీ.....

హృదయ స్పందన.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational