కుటుంబం
కుటుంబం


................
ఇంట్లోని మనుషులగుంపు కాదు కుటుంబమంటే!
బంధుత్వమున్న జనసంఖ్య కాదు కుటుంబమంటే!
రక్తంతోనో మంగళసూత్రంతోనో
ముడికాదు కుటుంబమంటే
మమకారపు తీగల అల్లిక కుటుంబమంటే!
అనురాగపు తేనెలచేరిక కుటుంబమంటే!
అంగాలెన్నున్నా ప్రాణమొకటైన
ఉమ్మడిదేహం కుటుంబమంటే!!