కుటుంబం ఓ హరివిల్లు
కుటుంబం ఓ హరివిల్లు
అందమైన పొదరిల్లు
ఆప్యాయతల హరివిల్లు
మమతలు పంచే నెలవు
అనురాగాలకు కొలువు
కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా,
అండగా నిలిచే స్థైర్యం
వెన్నంటి ఉండి నడిపించే ధైర్యం
ప్రతి అడుగున ప్రోత్సాహం
అన్నింటా ఉత్సాహం
అందించే కుటుంబం
అది కదా భరోసాల భాండాగారం
***%%%***
ఫణికిరణ్
