కురుణలేని
కురుణలేని
కరుణలేని మనిషికన్న..కఠినశిలయె నయమంటా..!
కరుణామృత దైవమవగ..చేసె తపం చూడంటా..!
మాటలతో ఎవరిమతిని..సవరించగ చూస్తావోయ్..
మౌనమెంత బలమైనదొ..మునిగితేనె అందంటా..!
చరిత్ర చాటిన కథలవి..ఎన్నిసార్లు చదివేవోయ్..
నిన్నునీవు మార్చుకోగ..శ్వాసధ్యాస నిలుపంటా..!
చిరునవ్వుల నెలవంకగ..జీవించగ తెలియాలోయ్..
మనసు చేయు చిత్రాలను..గమనిస్తే చాలంటా..!
బాధలెవరి చెవిలోనో..రొదపెడితే ఏమిటొరుగు..
స్నేహకల్ప తరువంటే..నీకునీవె తోడంటా..!
ప్రేమలేఖ వ్రాసేందుకు..ప్రయాసేమి పడతావోయ్..
తిరిగేమీ ఆశించని..తనముంటే కుదురంటా..!
