కుందనపు బొమ్మ
కుందనపు బొమ్మ


ప౹౹
కుందనపు బొమ్మగ కనిపించినది నీవేనా
అందమైన మైనాగా ఆకర్షించినది నీవేనా ౹2౹
చ౹౹
అనుకోకుండనే జరిగిందీ ఆవైపు వీక్షణం
అనేకమైన ఆలోచనలే మదిలోన తక్షణం ౹2౹
మనసంత సుందర మందిరం మరులతో
సొగసంత సమీరమై వీచే వింజామరలతో ౹ప౹
చ౹౹
ఎదురుగా నిలిచి ఎదతోనే పిలుపే పిలిచి
బదలుగా పలుకలేని మూగత్వమే వలచి ౹2౹
ముసిమి మిగుల చేరి ముదం తానే పెంచి
పసిమిబంగారపు సోయుగంతో మరిపించి ౹ప౹
చ౹౹
కలలోను కనులలోనూ కళకళలతో నిలిచి
తలలో యోచనల తన్మయత్వము అలిసి ౹2౹
లేఖా కావ్యంగా లేఖనీయమైనే ఆ సొగసు
లేఖాహారునికి అర్పణచేయలేవా మనసు ౹ప౹