STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

క్షణములేదు

క్షణములేదు

1 min
9


నినుతలవని క్షణములేదు - వేదనగా గడిపినాను 
నినుమరవని తలపులతో - శూన్యముగా గడిపినాను

నీ వూసులు మోసులెత్త- ఆత్రముగా వేచియుంటి 
గుండెగుడియె తెరచినాను- నిరాశగా గడిపినాను 

మధురోహలు యెదనురేగ- మౌనముగా నేనుండీ 
నీవుండని సమయమేను - విరాగిగా గడిపినాను 

శిశిరములే శరములుగా - మారినన్ను సంధించగ 
వసంతమే ఎదురవునని- మోదముగా గడిపినాను 

గగనమంటె గానముతో - కైమోడుపు చేసె 
ప్రణయాలే వ్రణములుగా-బాధించగ గడిపినాను 


Rate this content
Log in

Similar telugu poem from Classics