STORYMIRROR

Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

కొత్తేమీ కాదు

కొత్తేమీ కాదు

1 min
8

మనసు కుదుటపడింది 

అని అనుకునేంతలో

మాట వినిపించింది

మళ్లీ ఆ రూపు కనిపించింది

కళ్ళలో దాగిన జావళీలు

గుర్తుకొచ్చి హృదయం ద్రవించింది


ఏదో చిన్న ఆశ

గత అనుభవాల నావను చిన్నాభిన్నం చేసింది

లేని ధైర్యం కూడగట్టుకుని

పాత పోస్ట్లు అన్నీ చూసాను

అన్నిటిలో ఒకే మాటుంది

ప్రేమ మళ్లీ తిరిగి వస్తుంది


ఏ నమ్మకంతో అలా వ్రాసుకున్నానో తెలీదు

రెండో సారి నీ రూపంలో ప్రేమ తిరిగి వచ్చింది అనుకున్నాను

చెట్టాపట్టాలు వేసుకుని తిరగాలని

నీకోసం చీకట్లో తిరగాలని

ఎటువంటి ఉద్వేగ భావాలు లేవు

నన్ను అభిమానించే వ్యక్తి 

ఒకరున్నారని చాలనుకున్నాను


ఇష్టం లేకపోతే

పాషాణంలా మారనక్కర్లేదు 

అది నీకర్థం కాదు

బహుశా 

నువ్వూ నాలా గాయపడ్డావేమో

ఇంకా కోలుకోలేదేమో


నాకిది అలవాటే

హృదయాలను తరచి చూసి

వేదనను తీసుకెళ్లడం

వేధించే మనుషుల మధ్య 

విచిత్రంగా జీవించడం 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama