కోరికలకు బానిస
కోరికలకు బానిస


చెడు చూసితిని
చెడు వింటిని
చెడు మాట్లాడితిని
చెడుయే మంచిగా భ్రమపడి
చెడుతోనే సాంగత్యము జరిపితి
కామ క్రోధములను మరల ఆహ్వానించితి
కోరికలకు బానిసగా మారితి
నన్ను నేను కావలి కాచుకోవలె
అరిషడ్వర్గాల జయించి
కోరికల గుర్రాలకు కళ్లెం వేసి
ఈశ్వరుని స్మరియించవలె
జ్ఞానమును జన్మరాహిత్యమును పొందవలె