కనురెప్పల చెప్పాడు
కనురెప్పల చెప్పాడు
కనురెప్పల చప్పుడు లో
మనసు రహస్య గీతం దాగి ఉంది,
నిశ్శబ్దం మాటలై మారి
ప్రేమను పలుకుతోంది...
కనురెప్పల తాకుడు
గాలిలో తరంగం లా,
మనసులోని కలలను
జాబిలిలా నిద్రపుచ్చుతుంది....
నిశీది నిశ్శబ్దం లో
కనురెప్పల చప్పుడు వినిపిస్తే,
అది హృదయం గడప తట్టి
జ్ఞాపకాలను రప్పించినట్లుంది...
కనురెప్పల చిన్న చప్పుడు
గుండెకు ఒక లయ,
మాటలు లేని కవితలా
మనసు చెబుతున్నా గాథ...
