కనులు..
కనులు..
కనులు పలకరిస్తాయని తెలియదు
నిన్ను చూసే వరకు ఎన్నెన్నో భావాలను
నీ కళ్ళలో వెతికి చూశాను కనిపించెను నా రూపం...
అందమైన నీ అదరం పై చిరునవ్వై వేలివిరిసింద
నీ నవ్వులో దాగున్నది నేనే అని తెలిసి మనసుకెంతో
పరమానందం నీ గుండె గూటిలో ప్రేమ పుష్పమై వికసించాలని ఉంది.
నీ తలపుల వలలో పడి నే మనిషిని కాలేకపోతున్నా
నీ సొగసుల మైకంలో పడి నీకు నే బానిసనైపోతున్నా
బయటకు రాలేను లోపల ఉండలేను
మనసేమో నీవైపు పదే పదే మళ్ళుతుంది
నాకే తెలియకుండా నీతో ఉండిపోయానిలా...
... సిరి ✍️

