కనుల సోయగం
కనుల సోయగం
కర కంకణం కులుకు చిలుకు తుంటే
కనుల సోయగం కలవర పెడుతుంటే
చెంపల చిన్నెలు చివుక్కు మంటుంటే
చిరునవ్వే చెకుముకి రవ్వైమెరుస్తుంటే
పరువపు ప్రాయం పూత పూయిస్తుంటే
పరదా మాటు పలుకే ఫక్కు మంటుంటే
వలపోత వయ్యార వడ్డాణమై పోతుంటే
వగలసెగల వాల్చూపు సొరై ప్రాకుతుంటే
రమ్యమైన రాగమేదో నీలో రగులుతుంటే
రవ్వల జవ్వ రమ్మని రంజుగా పిలుస్తుంటే
తారా చంద్రికలే తుళ్ళింత కళ నేర్పుతుంటే
తువ్వాయి వాయిద్య గానమై సాగుతుంటే
మదిలో ఏదో తెలియని గుబులే రేగుతుంటే
మౌనము వీడి నే మేఘంలా కదులు తుంటే

