కనుగొన్నానులే
కనుగొన్నానులే
ప౹౹
కనుగొన్నానులే కళ్ళలో ఏదో కమనీయం
తెలుసుకున్నాలే మనసులో మహనీయం ౹2౹
చ౹౹
అనుకోకుండా కలిగిందిగా ఆ అనుభూతి
చెప్పకుండా మది ఇచ్చుకున్న అనుమతి ౹2౹
లోలకంలా తిరిగే ఊహలన్నీ రెక్కలిప్పగా
వాలకం తెలిసి వాకిటిలో వాలినే కుప్పగా ౹ప౹
చ౹౹
కలిసే ఎదలోనా కానరానిది ఆ కలవరమే
వలచే వలపూ వదలని కలకు సుందరమే ౹2౹
మాటే వినని మరులు మారాము చేయగ
సాటే రాని సౌందర్యం సరసమై విచ్చేయగ ౹ప౹
చ౹౹
హృదయమంతా ఉప్పెనై పొంగినే తలపూ
ఉదయ రాగమూ ఉధ్బవించే లేక అలపూ ౹2౹
తరుణమొచ్చే తన్మయమే పెంచి ఎడదలో
కారణమైన ప్రేమనే కనిపించనీ పైయ్యెదలో ౹ప౹