కన్నుల్లో...
కన్నుల్లో...
ఆ విశాల కన్నుల్లో
విశాల దృక్పథం ఎన్నో
ఆ విశాల కన్నల్లో
చిరురు దివ్వను నేను
ఆనందాల కోసం
నిశీధి దుప్పటిలో
స్వప్నాల వెంట
మినుగు విహరిస్తూ
బ్రాంతి చెందే మనసు
ఆ విశాల కన్నుల్లో
అప్పుడప్పుడు
నాలో నేను గొంగళి పురుగు నవుతూ...
ఆ గూటికి వదిలి
మరో కొత్త స్వరూపంతో
దివ్యాంగంగా సీతాకోకచిలుక లా
పువ్వులో పువ్వునై
పసిడి వన్నే నవ్వాలనీ..
ఆ విశాల కన్నుల్లో
అప్పుడప్పుడు తడిసిన
అక్షరాలను వర్ణమాల చేసి
ఎప్పుడో వెలిసిపోయిన
జ్ఞాపకాల భావప్రద మును
పొందిక చేసి
ఆ విశాల కన్నుల్లో
జీవం పోస్తూ....
నన్ను నేను పొంద పరిచే
ఆరాటం చూసి
హృదయం నవ్వుకుంటుంది.
ఆ సంతృప్తితో
ఆ విశాల కన్నుల్లో
విశాల ప్రపంచం అవుతుందని.... !!
... సిరి ✍️❤️

