కన్నుల్లో
కన్నుల్లో
మబ్బు పట్టిన మనసులో కారు చీకటి కనిపించే
కష్ట కణాలు వేడిలో తనువు దహించే
పచ్చని కొమ్మలో సూర్యుడు ఎరుపెక్కే
బడుగు జీవుల వంట్లో నీరంతా తాగేసాను…
కన్నుల్లో దీనత్వపు ప్రశ్నలు ఉదయించే
మోయలేని భారం పడుతుందని
చీకటితో స్నేహం ఎందుకు చేస్తావని
అర్ధరాత్రి పేగుల్లో అరుపులు వినిపించాయి..
గబ్బిలాల ప్రేలాపనలు వింటూ
అటు ఇటు గాని జీవనంలో సాగుతూ
స్మశాన వైరాగ్యం ప్రదర్శించుకుంటూ
నిరాశలో మనసు కప్పిపెట్టి తిరుగుతాయి..
ఎన్నో నిరాకారాలు చూస్తున్నాయి
చీకట్లో ఆకారం పొంది వెలగాలని
రత్నపు కాంతి కనీసం చూడాలని
ఎన్ని గాజు పెంకులు గుచ్చుకున్నాయో వాటికోసం..
కాలానికి ఉరిపడ్డ నిరాశ జీవితములో
ఎండిన చెట్టుకు రాళ్లు విసురుతూ
కాయని ఫలాల కోసం ఎదురుచూస్తూ
కన్నీళ్లు అన్ని ధారబోసి కూర్చున్నారు…
అంతా ఎడారి బతుకులో నిప్పులా
తీరని దాహంతో ప్రయాణం సాగుతుంది
దగాపడ్డ లోకంలో బికారిలా తిరుగుతూ
బడుగు జీవికి స్వర్ణపు గొడుగులు దొరకవు..

