కన్నీటి విలువ
కన్నీటి విలువ
చెక్కిట జారిన కన్నీళ్ళు
ఘనీభవించిన మాటలకు ఆనవాళ్లు
మానసిక సంఘర్షణకు ప్రతిరూపాలు
అనంతమైన వేదనకు నిదర్శనాలు
ద్రవించు మదికి సాక్ష్యాలు
అలాంటి కన్నీటికి విలువ కట్టగలమా
ఆ కన్నీటి విలువ కేవలం
తడిసిన తలగడకే తెలుసు
చెలిమి చేసిన చీకటి కే తెలుసు
ఘనీభవించిన మనసుకే తెలుసు
తడియారని చెంపలచారికలకే తెలుసు
గండి పడిన గుండెకే తెలుసు
తేటపడిన నయనాలకే తెలుసు
తేలికపడిన మదిగదికే తెలుసు
విలువైన ఆ కన్నీటిని మోసే
నాకు కాక ఇంకెవరికి తెలుసు
ఉప్పెనలా పొంగే
ఆ ఉప్పు నీటి విలువ
కష్టసుఖాలలో తోడుగా వుండే
ఆ కన్నీటి విలువ
