కన్నీళ్లు సుడులు...
కన్నీళ్లు సుడులు...
కన్నీళ్లు సుడులు తిరుగుతుంటే
మౌనంగానే ఉన్న బావి దగ్గర కూర్చున్నా
పోగు చేసిన కష్టాల రాళ్ళను విసురుతుంటే
కన్నీళ్లు సుడులు తిరుగుతూ దుఃఖం పైకి వస్తుంటే
నా మదిలో భావోద్వేగం పైకి పొంగుతుంది
గులకరాళ్లు పోగు చేసుకున్నాయి మనసు నిండా
బావిలో నీళ్లలా పైకి తేలుతుంది బాధంతా
సమాధానం లేని ప్రశ్నలు సంధిస్తూ
ఊపిరాడకుండా ఊహల్లో తేలుస్తుంది
అంతరంగం అనర్గళంగా మాట్లాడుతుంది
గుండె ఘోషను తనలోనే వినిపించుకుంటూ
భారమైన భావాన్ని మొయ్యలేక మోస్తూ
కన్నీరు పైకి తేలుతుంటే కోరికల రెప్పలు ముడుచుకొనె
ఆశలు పుష్కలంగా పైకి తేలుతున్నాయి
సుదీర్ఘమైన ఎడారి మనసులో మాటలు లేక రాకా
పచ్చదనము లేని మైదానం బోసి నవ్వులు కానరాక
అనంత ఆకాశాన్ని ఏకాంతంగా పిలుస్తుంది
బావిలో కప్పలా తయారైన బతుకు బండి
పైకి రాలేక కింద ఉండలేక సతమతం
విశాల సంద్రం చూస్తుంటే విశాల భావం పుట్టిన
అందరినీ ఆదరించలేక కుల మతాన్ని తోలుతున్న
బుద్ధిలో విషం కూర్చొని ఆలోచిస్తుంటే
బుద్ధిని స్వచ్ఛమైన మనస్సు ఎలా తెలుస్తుంది
ఇరుకు సందుల్లో తిరిగితే శాంతం బోధపడదు
ఆకాశం చూస్తే ఓదార్పు లభిస్తుందా
కన్నీళ్ల భాషల్లో కనికరం కానరాదు
ఓదార్చడానికి ఓపిక కరువై పోతుంటే
ప్రశాంతంగా మనసును నిలప లేకపోతే
అలజడిలో కనురెప్పలు ఎలా మూతబడి నిద్రపోతాయి..
.. సిరి ✍️❤️

