STORYMIRROR

murali sudha

Romance

4  

murali sudha

Romance

కలవరింత

కలవరింత

1 min
330

కలవరింత......


వేడెక్కిన గుండె గది ఒక్కోసారి బాగానే బరువు తూగుతుంది

బరువెక్కిన రెప్పలు తీర్చలేకపోయిన బాధను మోస్తూ 

క్షణాలతో యుద్ధం చేస్తుంది...


నిజం....

నీ సన్నిధిలో నిలుచున్న బతుకు

లేతకొమ్మ తీగలై రాగాలు తీసినట్టు సాగితే

నీ దూరపు జతలో వెన్నెల మరచిన నిశిలా నల్లగా చిక్కిపోతుంది


ఎందుకిలా...

అంటూ నన్ను నేను వేదించుకుంటూ

నిన్ను సాధించాలనుకుంటాను

ఊపిరిని గట్టిగా బిగబట్టి 

నా ఆయువును నీ చేతుల్లో కుప్పగా పోయాలనుకుంటాను

పాపిట సిందూరంగా నిన్ను మార్చేసుకుంటూ

నుదుటన మెరిసే బొట్టుతో సిగ్గుల మొగ్గను కావాలనుకుంటూ 

కలల కాణాచిని అవుతుంటాను


విరహాలు

వియోగాలు మాత్రం

ఇంకేమీ పట్టనట్టు

నీ దూరంలోనే వాటికి జీవం ఉన్నట్టు

సంతోషపడుతూ

నాకోసం ఉక్రోషాన్ని దాచిపెడతాయి

నా ఉడుకుమోతు తనాన్ని చూస్తూ మనసారా నవ్వుకుంటాయి.....


సుధామురళి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance