STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కలవల కన్మణి

కలవల కన్మణి

1 min
367

అలంకరణే లేని

కొమ్మకు పూచిన పుత్తడివి 

చినుకు మెత్తగా వాలి

కునుకు తీసిన సొగసు నీది

పదగతులల్లిన 

పదహారణాలు ముత్యాలై

నవరస రత్నఖచితం నీవే కాబోలు 

సిరివెన్నెల చల్లని కాంతికి

పూసి మెరిసిన వాలు కనులే 

నీ కాటుకలద్దిన నయనాలు 

ప్రేమ పద మధురిమకు వాయనాలేమో 

ముగ్ధ సిరులొలికించు నీ

నవ్వే పెదవుల నాట్యం నూటొక్క

జిల్లాలకు ఊట బావులకు చేరు 

తీయని వంకల వ్యవహారమో!

సింధూరం చైత్రవీణై రాగం వినిపిస్తే 

చూసే కళ్ళకు కొత్త లోకానికి 

దారిని చూపి శివరంజనిలా గానామృత 

కచేరి చేసినట్టు అందం ఓ

అద్భుత సోయగాల సరాగం 

వెన్నెలకే వన్నెలద్ది పున్నమి నాటికి

వనాలన్నీ పూలై పూచి గాలికి 

గంధర్వ రాగాల మాలిక చేసెదవేమో.....!!



Rate this content
Log in

Similar telugu poem from Romance