కలతో కాపురం
కలతో కాపురం


పరుషమైన నీ మాటల వెనుక
నా మీద ఎంతో ప్రేమ ఉందనుకున్నా
నువ్వు నన్ను నిందించినా
అది నేను మారడానికే అనుకున్నా
నువ్వు ఎప్పటికీ నన్ను ప్రేమించనని చెప్పినా
అది కేవలం నటన అనుకున్నా
బండ రాళ్ళలో నీళ్లుంటాయి
నీ మనసులో మన తలపులుంటాయి
అంటూ ఎక్కడలేని ఆశావాదం కనబరిచా
కానీ నువ్వు మరొకరికి సొంతమయ్యాక అర్థమైంది
నాతో గడిపిన సమయం నీకు కేవలం కాలక్షేపం అని
ఇన్నాళ్లూ నే కలతో కాపురం చేశానని