STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Romance

4  

Venkata Rama Seshu Nandagiri

Romance

కలలరాణి

కలలరాణి

1 min
321

సుమ గంధాన్ని ఆస్వాదించే ఓ సుమబాలా

అందానికి అందం చేకూర్చే రాజ కుమారిలా

పరిమళించే పూదోట లో విరిసిన కుసుమంలా

చూచేవారి మదిని దోచే రమణీయ శిల్పంలా

అలరించావు చిత్తరువు నందు ముద్దు గుమ్మలా

అందమైన నీ చిత్తరువు దోచె నామదిని అంతలా

కన్నుల్లో నీ రూపమే మెదిలే రేయింబవళ్ళు కలలా

నిను కాంచినంతనే మనసంతా కరిగిపోయె వెన్నలా

నీ ఆలోచనలలో మది ఓలలాడుతున్నది నావలా

ఎంతకాలం వేచి ఉండాలి స్వాతి వానకై చకోరపక్షిలా

నీకనిపించలేదా మనది జన్మ జన్మల వీడని బంధంలా

నీ చేయందుకోవాలని రేయింబవలు తపన పడుతున్నానిలా

నీ మెడలో మూడుముళ్ళు వేయాలని వేచి ఉన్నానిలా

నీతోనే ఏడడుగులు నడవాలని, కలలు కంటున్నానిలా

ఇకనైనా కరుణించి రావే నా సంసార నావకు చుక్కానిలా

సంబరాలే అంబరాన్నంటగా మన గృహసీమ

నలంకరించరావే మహరాణిలా


Rate this content
Log in

Similar telugu poem from Romance